మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం

మన Enadu: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర ఈనెల 8 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చేశారు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయాన్ని కాకతీయులు క్రీస్తుశకం.1311 లో నిర్మాణం చేసినట్లు ఇక్కడున్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు లింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోనే అతికొద్ది దర్శనీయ దైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొంత శివలింగం పెరుగుతూ ఉంటదని స్థానికులు చెపుతూ ఉంటారు. శివలింగం మీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసిన మళ్లీ జల ఊరుతూనే ఉంటుంది.

Mellacheruvu Shambhu Lingeswara Temple : మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. జాతరకు చుట్టుపక్క గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రానున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొననున్నారు. మేళ్లచెరువు జాతరలో ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్లు పోటీల్లో నిలుస్తాయి. మేళ్లచెరువు జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. విద్యుత్ దీపాల కాంతులతో ఏర్పాటు చేసిన ప్రబల వద్ద నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మేళ్లచెరువు శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Share post:

లేటెస్ట్