రేవంత్​ సర్కారుకు నిరసనకు ఉప్పల్​ బీఆర్​ఎస్​ ధర్నా

మన Enadu: ఎల్​ఆర్​ఎస్​ పథకంపై కాంగ్రెస్​ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీహెచ్​ఎంసీ (GHMC) ఉప్పల్ సర్కిల్​ కార్యాలయం వద్ద బీఆర్​ఎస్​ ధర్నా నిర్వహించింది. భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ పిలుపు మేరకు LRS విషయం లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు.

LRS పేరుతో 20వేల కోట్లు దండుకునేందుకు 25 లక్షల కుటుంబాలపై అధిక భారం మోపుతుందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రజలకు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈకార్యక్రమంలలో బీఆర్​ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి , పసుల ప్రభాకర్ రెడ్డి, జిహెచ్ఎంసి స్టాండింగ్ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, స్థానిక నాయకులు సాయిజన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ పాల్గొన్నారు.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *