మన Enadu: మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం ముందుస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
హక్కుల కోసం పోరాడి సమాజంలో తనకంటూ ప్రత్యేమైన స్థానం కోస ఉద్యమ మహిళలందరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చరిత్రలో మహిళలు సమానత్వం కోసం పోరాడారని పేర్కొన్నారు. మహిళలు విజయవంతంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే వరకు ఎత్తుకు ఎదుగుతున్నారన్నారు.
ఈ కార్యక్రమము లో మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభు దాస్ మరియు ప్రెసెడెంట్ మదన్ ,RP సుజాత ,జగన్ ,వాసు ,లంబు శ్రీనివాస్ ,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు .