Mana Enadu:ప్రస్తుత రోజుల్లో పిల్లలు టెక్నాలజీకి, స్మార్ట్ గాడ్జెట్లకు అతుక్కోపోతున్నారు. గంటల తరపడి ఫోన్లలోలోనే గడిపేస్తున్నారు. దీంతో వారు మైండ్ సెట్ పూర్తిగా స్మార్ట్ గాడ్జెట్లవైపే వెళుతోంది. దీంతోపాటు అవి ఉంటు చాలు సరిగా తినరు. టైమ్‌కి పడుకోరు. స్కూళు నుంచి వచ్చాక హోమ్ వర్క్ కూడా సరిగ్గా చేయరు. కొంతమంది ఆన్లైన్ గేమ్స్ వల్ల తమని తాము అలానే ఊహించుకొని మానసికంగా కుంగిపోతారు. దీంతో క్రమంగా జ్ఞాపకశక్తి మసకబారిపోతోంది. అందుకే పిల్లల్లో జ్ఞాపకశక్తి(Memory) పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు(Egg)ను వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇది రోజంతా జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడి జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరగడానికి సాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి అల్జీమర్స్(Alzheimer’s) ముప్పును తగ్గిస్తాయి.
పైవాటితోపాటు బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్షలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడులో కణాల పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తి పెరగడానికి కారణమవుతాయి. బ్రొకోలీ, నేరేడు, స్ట్రాబెర్రీస్, రేగుపండ్లు, ఉల్లి, వెల్లుల్లి, అవకాడోల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తి మెరుగుపడేలా చేస్తాయి. అప్పుడప్పుడూ డార్క్ చాక్లెట్(Dark Chocolate) తిన్నా మెదడు పనితీరు బాగుంటుంది.
ఇలా చేస్తే మెదడు చురుగ్గా..
మల్టీటాస్కింగ్(Multitasking) మన జ్ఞాపకశక్తిని క్రమంగా బలహీనపరుస్తుంది. దీని వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే సమయం ఆదా చేయడానికి అనేక పనులను చేయడానికి అంగీకరించి ఇబ్బంది పడొద్దు. ఒకేసారి నాలుగైదు పనులు సగం సగం చేసేకంటే ఒకటి పూర్తయ్యాక మరొకటి చేయడం ఉత్తమం.
☛ ప్రతి రోజూ కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర పోవాలి. నిద్ర తక్కువైతే మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుంది.
☛ మంచి పోషకాలతో కూడిన ఆహారం మెదడును, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అలాగే పరిమితికి మించి ఆహారం తీసుకోవడం కూడా మంచిదికాదు. ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, గింజలు, బెర్రీలు వంటి వాటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి.

విటమిన్ బి12 లోపం లక్షణాలు
మానసిక స్థితిని నియంత్రించడంలో విటమిన్- బి12(VitaminB12) కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గితే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి మానసిక కల్లోలానికి, కోపానికి, నిరాశకు, చిరాకుకు దారితీస్తుంది. మానసిక స్థితి, మెదడు పనితీరుకు మెదడులోని రసాయనాలు సరైన స్థాయిలో ఉత్పత్తి కావాలి. ఆ రసాయనాల ఉత్పత్తిలో విటమిన్ బి12 కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే చేతులు, కాళ్లలో జలదరింపులు, తిమ్మిరి వంటివి వస్తాయి. విటమిన్ బి12 కోసం కోడి మాంసం, చేపలు, గుడ్డు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి. ఈ లోపం మరీ అధికంగా ఉంటే సప్లిమెంట్లు, ఇంజక్షన్లు అందిస్తారు. శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా విటమిన్ బి12 లోపాన్ని కొంత అధిగమించేందుకు దోహదపడతాయి.








