ఓ రెస్టారెంట్ నిర్లక్ష్యంతో వినియోగదారుడు తీవ్రంగా అశ్వస్థతకు గురైన ఘటన జరిగింది. పన్నీర్ చిల్లీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తే స్విగ్గీ మాత్రం చిల్లీ చికెన్ డెలివరీ చేసింది. వెజిటెబుల్ తినాల్సిన వ్యక్తి ఇది తిని తీవ్ర ఆశ్వస్థత పాలయ్యాడు. నాన్-వెజ్ ఫుడ్ డెలివరీ చేశారని ఆరోపిస్తూ స్విగ్గీలో ఫుడ్ పంపిన రెస్టారెంట్‌పై పోలీసులకు కంప్లైయింట్ చేశాడు. చిల్లీ పన్నీర్‌కు బదులు చిల్లీ చికెన్ డెలివరీ చేశాడని, అది తినడం వల్ల తాను ఆసుపత్రి పాలయ్యానని కంప్లైయింట్ పేర్కొన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని అషియానా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో చిల్లీ పన్నీర్ కావాలని ఆర్డర్ చేసుకున్నాడు. తనకు బ్రాహ్మణ కుటుంభానికి చెందిన వ్యక్తి. ఈక్రమంలోనే చిల్లీ పన్నీర్ మాత్రమే తీసుకు రావాలని అలంబాగ్‌లోని చైనీస్ ఫ్యూజన్ రెస్టారెంట్‌కు పర్సనల్‌గా సూచనలు చేశాడు. కానీ రెస్టారెంట్‌మాత్రం వినియోగదారుడు సూచనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నాన్‌వెజ్ ఫుడ్‌ను తయారు చేసి స్విగ్గీలో కస్టమర్‌కు పంపించారు. వెజ్ పుడ్ వచ్చిందని తిన్న అతను తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. పొరపాటు గ్రహించిన కస్టమర్ అది చిల్లీ చికెన్ అని తెలుసుకున్నాడు. తాను శాఖాహారినని, చిల్లీ చెకెన్ డెలివరీ చేశారంటూ రెస్టారెంట్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైనీస్ ఫ్యూజన్, స్విగ్గీ డెలివరీ బాయ్‌పై కేసు నమోదు చేసుకున్న అషియానా కొత్వాలి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై స్పందించిన చైనీస్ ఫ్యూజన్ రెస్టారెంట్ ఈ సంఘటన పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చుకుంది.