ఉప్పల్​ త్రిముఖ పోరు..ఓటు బదిలీపైనే ఆశలు

టికెట్​ టెన్షన్​..నామినేషన్​ ఘట్టం ముగిసింది..ఇక ప్రచారం హోరెత్తించే సమయం ఆసన్నమైంది. ఉప్పల్​ రాజకీయం నేటితో షురూ కానుంది. సెగలు పుట్టించే ప్రచారానికి గ్రేటర్​ హైదరాబాద్​లో ఉప్పల్​ వేదిక కానుంది. ఇప్పటికే అధికారపార్టీ ఇద్దరు మంత్రులు కేటీఆర్​, హరీష్​రావు వచ్చి దిశానిర్దేశం చేశారు.

ఉప్పల్​ ఎలివేటెడ్​ కారిడార్​ పనులు మొదలుపెట్టిందే మేముంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​ ప్రచారం చేస్తున్నారు. పది డివిజన్లలో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో రెండు కార్పొరేట్​ స్థానాలు గెలిచిన కమలం పార్టీ. మరో నాలుగింట రెండోస్థానంలో ఉన్నారు. తాజాగా కేసీఆర్​ వ్యతిరేఖ ఓటు బ్యాంకు తనకే పడుబోతుందని ధీమాగా ఉన్నారు.

అధికారపార్టీ అభ్యర్థి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటే తన ట్రస్టు అందించిన సేవలనే నమ్ముకున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం పేరుతో కంటే బీఎల్​ఆర్​ చారిటబుల్​ ట్రస్టు పేరుతో ప్రజలకు చేసిన సేవ పేరుతోనే జనంలో ప్రచారం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రత్యర్థులంతా ఇప్పుడు గులాబీ గూటిలోనే ఉన్నారు. వీరి బలం గులాబీకి మైలేజ్​ తీసుకొస్తుందా..? లేదా ప్రతిపక్షాలకు బలంగా మారుతోందానే అనే సందేహాం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరు గ్యారంటీలు, తులం బంగారం వంటి పథకాలతో హస్తం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వశాన్ని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బలంగా భావిస్తున్నారు. కార్పొరేటర్​గా ప్రజలకు చేసిన సేవ , మరోసారి అవకావం ఇస్తే కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ఉప్పల్​ అభివృద్ధి చేసి తన సత్తా ఎంటో చూపిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాలనీల్లో యువత, నిరుద్యోగులు, మహిళలు హస్తం పార్టీ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *