ఈ టిప్ప్​ పాటిస్తే..చర్మం మెరిసిపొతుంది!

చర్మం జిడ్డుగా మారకుండా మెరిసే మాయిశ్చరైజర్ కావాలంటే విటమిన్ సి, విటమిన్ ఇ, ఇతర పదార్థాలతో కూడిన ఒకదాన్ని ఎంచుకోండి. అది మన చర్మాన్ని ఏ టైమ్‌లో అయినా మెరిసేలా చేస్తుంది. బొద్దుగా, మృదువుగా ఉండే చర్మానికి తేమ అవసరం. ఇది లోపల నుండి చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్‌ని అందిస్తుంది.

పండగలప్పుడు, పార్టీలప్పుడు విపరీతమైన పని ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా చర్మం మెరవదు. అలాంటి టైమ్‌లో ఫేస్ మాస్క్ మనకు హెల్ప్ అవుతుంది. మన బ్యూటీని పెంచేందుకు ఫేస్ మాస్క్ హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ కలర్‌ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.సీరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పండుగ సీజన్‌లో మీ స్కిన్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి సీరమ్స్ మంచి ఆప్షన్. బెస్ట్ సీరమ్ మన డెయిల్ స్కిన్ కేర్ రొటీన్‌ని త్వరగా మెరుగు పరుస్తుంది. అంతర్గతంగా మెరుపుని అందిస్తుంది. అయితే చర్మానికి అనుకూలమైన భాగాలు, ఫార్మూలాలతో ఉన్న సీరమ్‌ని మాత్రమే ఎంచుకోవాలి. స్కిన్ కేర్ ఎంచుకునేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ట్రై చేయాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

వీటికి తోడు అదనంగా తాజా పళ్ళు, కూరగాయలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం చర్మాన్ని లోపల్నించి రిపేర్ చేసి మెరిసేలా చేస్తుంది. చివరగా, పండుగల సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. ఎక్కువ కేలరీలకి దూరంగా ఉండి వర్కౌట్ చేయండి. దీంతో మీ స్కిన్ మెరుపుని ఏవీ అడ్డుకోలేవు.

Share post:

లేటెస్ట్