Vladimir Putin: బ్రేక్ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనండి.. పుతిన్ సంచలన నిర్ణయం

ManaEnadu: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఓ సంచలన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా(Population) తగ్గడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్షీణిస్తున్న జననాల రేటును పరిష్కరించడానికి పని సమయాల్లో మధ్యాహ్న భోజన విరామం, టీ బ్రేక్ సమయాల్లో సన్నిహిత మహిళలతో సెక్స్‌(Sex)లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీని వల్ల సంతానోత్పత్తి పెరిగి దేశ జనాభా రేషియో పెరుగుతుందనే ఆయన భావిస్తున్నారని పలు నివేదికలు(Reports) పేర్కొన్నాయి. ప్రస్తుతం రష్యాలో సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు 1.5 మంది పిల్లల చొప్పున ఉంది. స్థిరమైన జనాభాను పొందాలంటే ఆ దేశం 2.1 రేటు కంటే ఎక్కువ కావాల్సి ఉన్నందున పుతిన్(Putin) ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదిక పేర్కొంది.

 ఉక్రెయిన్‌తో యుద్ధమే కారణమా?

ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం(Ukraine War) కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది, ప్రధానంగా యువ రష్యన్లు(
Young Russians) దేశం విడిచిపెట్టారు. మరోవైపు యుద్ధం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, తమని తాము రక్షించుకునే క్రమంలో శృంగానికి దూరంగా ఉంటున్నారని తాజా సర్వే(Survey)లో తేలింది. పైగా రష్యాలో పనిగంటలు అధికంగా ఉంటాయి. రోజుకు 12 నుండి 14 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీంతో పని, ఒత్తిడి కారణంగా అలసిపోయి పిల్లల్ని కనాలనే ఆసక్తి రషన్లలో కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రష్యాలో జననాల రేటు 1999 నాటి కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. జూన్ నెలలో జననాల సంఖ్య 100,000 కంటే తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

 మహిళలకు ఉచిత సంతానోత్పత్తి పరీక్షలు

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సంవత్సరంలో రష్యాలో జనాభా క్షీణతలో 18% అధికంగా నమోదైంది. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా గత సంవత్సరం కంటే 2024లో 49,000 మంది అధికంగా మరణించారు. ఈ నేపథ్యంలో పుతిన్ సర్కార్ కొన్ని ప్రణాళికలు రూపొందించింది. 18-40 మధ్య వయస్సు గల స్త్రీలకు వారి “పునరుత్పత్తి సామర్థ్యాన్ని(Reproducibility)” అంచనా వేయడానికి ఉచిత సంతానోత్పత్తి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కంపెనీలు తమ మహిళా ఉద్యోగులు పిల్లల్ని కనేలా ప్రోత్సహించాలని సూచించింది. అలాగే 24ఏళ్లలోపు వారు బిడ్డను కంటే వారికి 8,500 పౌండ్లను అందిస్తోంది. అబార్షన్లను నిరోధించింది. దంపతులు విడాకులు తీసుకోవడాన్ని నిషేధించింది. అలాగే ప్రతి జంట ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరింది. అయితే కొందరు పుతిన్ అనాలోచిత నిర్ణయాలను స్వాగతిస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు.

 

Share post:

లేటెస్ట్