
ప్రపంచంలో ఇప్పటివరకు మీరు అనేక రకాల రేసులు చూసి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు జరగబోయే రేస్ మాత్రం చాలా ఆశ్చర్యకరమైనది. అవును.. ఇది నిజమే.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ రేస్(Sperm Race) జరగబోతోంది. USAలోని లాస్‌ఏంజెలిస్(Los Angeles)లో ఈ స్పెషల్ కంపిటీషన్ నిర్వహిస్తున్నారు. నేటి బిజీబిజీ లైఫ్‌లో పురుషుల్లో లైంగిక సామర్థ్యం(Sexual ability), సంతానోత్పత్తి(Fertility) తగ్గుతున్న విషయం తెలిసిందే. దీంతో పురుషులలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ(A startup company) ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రేస్‌లో వెయ్యి మంది పాల్గొనబోతున్నారు.
ఆ సమస్యలపై అవగాహన పెంచేందుకే..
లాస్ ఏంజెలిస్‌లో ఈ నెల 25న ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ రేస్ జరగబోతోంది. స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ పురుషుల సంతానోత్పత్తి సమస్యల(Male fertility problems)పై అవగాహన పెంచడానికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రేస్‌లో దాదాపు 1,000 మంది పాల్గొంటారు. రేస్ కోసం ప్రత్యేకంగా 20 సెంటీమీటర్ల పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌ల (Microscopic race track)ను తయారు చేశారు. పాల్గొనేవారి వీర్యం నమూనాలను ఈ ట్రాక్‌లపై ఉంచుతారు. ఏ నమూనాలోని స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్‌ను చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.
The world’s first sperm race, held in Los Angeles, is bringing male fertility into the public spotlight.#spermracing #fertility #sports #sportsbetting #losangelesevents #la #spermraces pic.twitter.com/rfNsleImN2
— Brut America (@brutamerica) April 17, 2025
ఈ రేస్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన సామాజిక సందేశా(Social messaging)న్ని కూడా కలిగి ఉంది. పురుషులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నారు.