Health Secret: నలభైల్లో ఆరోగ్యంగా ఉండాలంటే!!

Mana Enadu:చాలా మంది మహిళల్లో నలభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. ఏదీ సరిగా చేయలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. అవేంటో ఓ లుక్ వేద్దాం..

 వ్యాయామం
నలభై(40’S)ల్లోకి వచ్చిన తర్వాత చాలామంది బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. సరైన ఆహారాన్ని(Food) తీసుకోరు. వ్యాయామం చేయరు. నలభైల్లో జీవక్రియలు నెమ్మదించడం వల్ల చాలా వేగంగా బరువు పెరుగుతారు. కాబట్టి సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చెయ్యడాన్ని అలవాటు చేసుకోవాలి.

విటమిన్లు (Vitamins)
వయసు(Age) పెరిగే కొద్ది విటమిన్ లోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది. విటమిన్ -డి లోపం ఏర్పడితే ఎముక సాంద్రత తగ్గి అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీయొచ్చు. ముఖ్యంగా ఐరన్, రైబోఫ్లావిన్, విటమిన్-బి తక్కువ కాకుండా చూసుకోవాలి.

 రాత్రి భోజనం
పనివేళలు, తీరిక లేకపోవడం వల్ల చాలామంది రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తుంటారు. ఇది జీవక్రియలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా రాత్రి భోజనాన్ని పూర్తి చెయ్యాలి.
* అలాగే సమయానికి తగినట్లు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు రొమ్ముల్లో గడ్డల్లాంటివి ఉన్నాయేమో స్వీయ పరీక్షతోపాటు వైద్యుల సాయమూ తీసుకోవాలి.

ఈ పదార్థాలతో కొవ్వు కరిగిద్దాం..

బరువు(Weight) తగ్గాలంటే వ్యాయామం ఒక్కటీ చేస్తే సరిపోదు. దానికి తగ్గట్లు డైట్ కూడా మార్చుకోవాలి. డైట్(diet) అంటే తినడం మానేసి కడుపు మాడ్చుకోవడం కాదు. తినే ఆహారంలో మార్పు చేసుకోవడం. అప్పుడే శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. కొన్ని పదార్థాలు తినడం వల్ల శరీరానికి మేలు జరగడంతో పాటు, కొవ్వు(Fat) తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 

 పసుపు
మన వంటల్లో వేసుకొనే చిటికెడు పసుపు మనకెంతో ఉపయోగపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రత తగ్గించడంతో పాటు, కాలేయంలో చేరిన వ్యర్థాలను తొలగించడంలో పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది.

 ఆవనూనె
ఇతర వంట నూనెలతో పోల్చుకుంటే ఆవనూనెలో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో అధిక కొవ్వు చేరదు. ఈ నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, ఓలిక్, లినోలిక్ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు హృద్రోగాలను దూరం చేస్తాయి. అందుకే ఆవనూనెను తరచూ తీసుకోవాలి.

 కరివేపాకు
శరీరంలో కొవ్వును తగ్గించడంతో పాటు అదనంగా కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది కరివేపాకు. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజూ ఏదోక రూపంలో కరివేపాకును తీసుకోవాలి.

 పెసలు
మొలకెత్తిన పెసర్లలో ‘ఎ’,’బి’,’సి’,’ఇ’ విటమిన్లు, లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం వంటి పోషకాలెన్నో ఉంటాయి.

 క్యారెట్
క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

 గ్రీన్ టీ (Green Tea)
అధిక బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో అధిక కెలొరీలను తగ్గించడమే కాదు, మంచి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారీ ట్రై చేస్తే పోలా..

 

Share post:

లేటెస్ట్