Mana Enadu: ప్రజెంట్ ట్రెండు మారింది. ఫస్ట్ స్టడీ పూర్తి చేయాలి.. తర్వాత జాబ్ చేయాలి.. సెటిల్(Settle) అవ్వాలి..ఇవి ప్రస్తుతం యువత తీసుకుంటున్న నిర్ణయాలు. ఇక పెళ్లి ముచ్చటెత్తితే చాలు బాబోయ్.. అప్పుడే నాకు పెళ్లేంటి? నాకింకా టైమ్(Time) కావాలని నిర్మోహమాటం చేప్పేస్తున్నారు. కొందరు ఎలాగోలా తల్లిదండ్రులు, బంధువుల సూచన మేరకు పెళ్లి చేసుకుంటున్నా.. పిల్లలను కనే విషయంలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దీనికి వ్యక్తిగత, ఉద్యోగం, ఆర్థిక పరమైన అంశాలు కారణాలై ఉంటాయి. మరికొందరు పెళ్లి తర్వాత కొన్నేళ్లకు పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా నిరాశే ఎదురవుతుంది. దీనికి వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్య(Health) పరమైన సమస్యలు కారణమవుతుంటాయి. దీని వల్ల వారు మానసికంగా కుంగిపోతుంటారు. అయితే వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ(Pregnancy) ఆలస్యం కావడానికి గల కారణాలు తెలుసుకుందాం.
☛ కొందరికి శృంగారం(Sex) సమయంలో మంట, నొప్పి కలుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి లూబ్రికెంట్లు వాడతారు. వీటి తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అందుకే వైద్యుల సలహాతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
☛ పెళ్లి తర్వాత మహిళలు అతిగా వ్యాయామం చేయడం వల్ల అండం ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్ల స్థాయుల్లో మార్పులు వస్తాయి. ఇది అండం ఫలదీకరణ, విడుదలపై ప్రభావం చూపుతుంది.
☛ ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు కనీసం అరగంట పాటూ రోజూ వ్యాయామం(Exercise) చేయాలి. దీనివల్ల మగవారిలో శుక్రకణాల నాణ్యత పెరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి ఆరోగ్యం పెరుగుతుంది.
స్మోకింగ్ అలవాటుంటే అంతే సంగతి
ధూమపానం(Smoking) సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కారణమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకవేళ ధూమపానం అలవాటు ఉంటే దూరంగా ఉండాలి. స్మోకింగ్ వల్ల శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది. స్త్రీలలో అబార్షన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే పొగ, మద్యపానానికి దూరంగా ఉండటం బెటర్.
☛ ఆందోళన, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనేక మార్పులకు కారణం అవుతుంది. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేయండి.
☛ ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
☛ ఇతర ఆరోగ్య సమస్యలకు ఏవైనా మందులు వాడుతుంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకసారి వాటి వినియోగం విషయంలో డాక్టరు సలహా తీసుకోండి.
☛ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కెఫిన్ ఉండే పానీయాలు అతిగా వద్దు. కాఫీ, టీ రోజూ ఒకటి లేదా రెండు కప్పులు చాలు. అంతకంటే ఎక్కువ వద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
☛ జంక్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఫ్రై ఐటమ్స్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, గింజలు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులన్నీ ఉండేలా ఆహారం తీసుకోవాలి.
☛ మహిళల్లో థైరాయిడ్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భధారణ ఆలస్యానికి కారణమవుతాయి. అందుకే ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు డాక్టరును సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.