Summer Skin Care : సమ్మర్ లో హెల్తీ స్కిన్ కోసం.. ఇవి చేయండి

మన ఈనాడు:సమ్మర్ వచ్చిందంటే చర్మం పై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. విపరీతమైన ఎండలు, వేడి కారణంగా స్కిన్ పొడిబారడం, డీ హైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. చర్మ ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటిస్తే చాలు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజ్, కూల్ షవర్, ప్రాపర్ హైడ్రేషన్ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.

Summer Skin Care : సమ్మర్ సీజన్(Summer Season) వచ్చిందంటే .. వేడి, విపరీతమైన ఎండలతో చికాకుగా ఉంటుంది. అలాగే చర్మం పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతా సీజన్స్ తో పోలిస్తే సమ్మర్ లో చర్మం పై అతిగా శ్రద్ద(Skin Care) తీసుకోవాలి. సమ్మర్ లో చర్మాన్ని ఆరోగ్యంగా,నిగారింపుగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

సన్ స్క్రీన్

సాధారణంగా సమ్మర్ లో సన్ స్క్రీన్(Sun Screen) అప్లై చేయడం చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మ సున్నితత్వానికి తగిన సన్ స్క్రీన్ అప్లై చేయండి. దీని వల్ల సూర్యుని వచ్చే కిరణాల, ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

క్లోతింగ్

సమ్మర్ సీజన్ లో వదులైన, లైట్ వెయిట్, లాంగ్ స్లీవ్ దుస్తువులు వేసుకోవడం ఉత్తమం. ఇవి చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తాయి. సమ్మర్ లో కాటన్ దుస్తువులు బెటర్ ఆప్షన్.
సన్ గ్లాసెస్

సన్ గ్లాసెస్ కళ్ళను అలాగే కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన రక్షిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే UVA , UVB రేస్ నేరుగా కళ్ళ పై పడకుండ సన్ గ్లాసెస్ కాపాడతాయి.

ప్రాపర్ హైడ్రేషన్

శరీరానికి కావల్సిన నీళ్ళు తీసుకోవాలి. ఇది చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. డీ హైడ్రషన్ కారణంగా చర్మం పొడిబారడం, వాలిపోవడం జరుగుతుంది. ముక్యంగా సమ్మర్ నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.

కూల్ షవర్స్

సమ్మర్ లో వేడి నీళ్ళతో స్నానం చేయడం మానేయాలి. ఇది చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. చల్ల నీటితో స్నానం చేయడం చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

మాశ్చురైజర్

డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో మాశ్చురైజర్ తప్పనిసరిగా వాడాలి. ఇది మొహం పై పోర్స్ లేకుండా..చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది.

ఎక్స్‌ఫోలియేషన్

ఎక్స్‌ఫోలియేషన్ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. మెరిసే, ఆరోగ్యకరమైన ఛాయను అందిస్తుంది. కానీ అతిగా చేయకూడదు.

అలోవెరా

చర్మం సన్‌బర్న్‌ కు గురైనపుడు అలోవెరా జెల్ అప్లై చేస్తే.. చికాకు, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Related Posts

అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినబడుతోందా.. అది దేనికి సంకేతం?

మంచి ఆరోగ్యానికి ఆహారం(Food).. నీరు(Water).. గాలి(Air) ఎంత అవసరమో.. నిద్ర అంతకూడా అంతే అవసరం. ఒకవిధంగా చెప్పాలంటే మనం తిండి, నీరు లేకపోయినా ఒకటిరెండ్రోజులు బతకగలం.. కానీ ఒక్కరోజు నిద్రలేకపోతే అంతే సంగతులు.. ఆ మరుసటి రోజంతా మనం మనలోకంలో ఉండం..…

Health Secret: నలభైల్లో ఆరోగ్యంగా ఉండాలంటే!!

Mana Enadu:చాలా మంది మహిళల్లో నలభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. ఏదీ సరిగా చేయలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. అవేంటో ఓ లుక్ వేద్దాం..  వ్యాయామం నలభై(40’S)ల్లోకి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *