మన ఈనాడు: సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని GHMC మాజీ మేయర్, బీఆర్ఎస్(BRS) నేత బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన రామ్మోహన్.. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై చేరికపై క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.త్వరలోనే తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో కలిసి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా.. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బొంతు రామ్మోహన్.. జీహెచ్ఎంసీ మేయర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్‌గా బొంతు శ్రీదేవి ఉండగా జీహెచ్ఎంసీ మేయర్‌గా అవకాశం కల్పించాలని అప్పట్లో కేసీఆర్‌ను అడిగారు. కానీ అధిష్టానం ఇప్పటికైతే ఆశలు పెట్టుకొవద్దని సూచించింది. కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా ఉండటంతో ఉప్పల్ సీటు వస్తుందని అంచనాలు వేసుకున్నారు. రెండేళ్లపాటు సీరియస్‌గా ఉప్పల్ గ్రౌండ్లో లెవల్లో పనిచేసుకుంటూ వెళ్లారు. మరోసారి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారు.
మల్కాజిగిరి పార్లమెంటు స్థానం అడిగితే అది కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో డజను మంది మాజీ కార్పొరేటర్లు, 20మందికి పైగా ప్రస్తుత కార్పొరేటర్లుతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ చేసేలా వ్యూహం చేస్తున్నారు.