ఉప్పల్​ గెలుపుపై సీనియర్​ జర్నలిస్టు విశ్లేషణ

పల్లా మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ

ఉప్పల్ అసెంబ్లీ సమరం ముగిసింది. అయితే విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీల విజయ అవకాశాలను పరిశీలిస్తే గతం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ యాభైశాతం ఓట్లు పొందగా, కార్పొరేటర్ ఎన్నికల్లో 10కి 9 స్థానాలు గెలిచింది. 2020లోను 6 స్థానాల్లో విజయం సాధించింది. ఉప్పల్ నియోజకవర్గంలో పోలింగ్ యాభైశాతం కావడంతో గెలుపు ఎవరిని వరిస్తోందో తెలియాల్సి ఉంది.

ఉప్పల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు.. ఓటింగ్

2009లో 3,62,387 ఓట్లు ఉండగా 1,53,580 ఓట్లు పోలైనాయి. 2009లో 42.38 శాతం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ కు 57,874 ఓట్లు (37.07శాతం), టీఆర్ఎస్ కు 29,691 ఓట్లు(19.34 శాతం), పీఆర్పీకి 25,634 ఓట్లు(16.07శాతం) వచ్చాయి. బీజేపీకి 17,394 ఓట్లు(11.03 శాతం) లభించాయి. 2014లో మొత్తం ఓట్లు 4,21, 702 ఉండగా, 2,25,935 ఓట్లు పోలైనాయి. అంటే 49.07 శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 36.8 శాతం ఓట్లు అంటే 82,395 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 68,226 ఓట్లు (30.4 శాతం) వచ్చాయి. కాంగ్రెస్ కు 34,331 ఓట్లు(15.3 శాతం) లభించాయి. అయితే గత 2018 ఎన్నికల్లో 4,54,690 ఓట్లు ఉండగా, 2,27,899 ఓట్లు పోలైనాయి. 2018 ఎన్నికల్లో 51.65 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 1,17,442 ఓట్లు అంటే 51.53 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 69,274 ఓట్లు రాగా, బీజేపీకి 26,798 ఓట్లు వచ్చాయి. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రస్తుతం మొత్తం 529416 ఓట్లు ఉండగా, వీరిలో 275229 (51.99శాతం) మంది పురుష ఓటర్లు, 254147(48.01 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దర్డ్ జెండర్ ఓట్లు 40(0.01శాతం) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ 272870 పోలింగ్ అయితే ప్రస్తుతం ఓటింగ్ శాతం 51.54 శాతంగా నమోదైంది.

ఉప్పల్ అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికలు

ఉప్పల్ అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 2009, 2014, 2018లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ప్రధానపార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు పోటీపడ్డారు. 2009లో మాత్రం పీఆర్పీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఉప్పల్ అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికలు జరుగగా వినూత్నమైన తీర్పును ఇచ్చారు. 2009లో కాంగ్రెస్పార్టీ విజయం సాధించగా, 2014లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థి గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్పార్టీ అభ్యర్థి ఘన విజయం పొందారు. అంటే మూడు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడ్డారు. మూడు పార్టీలకు ఉప్పల్ ఓటర్లు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం 2023లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ పడగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

40 శాతం దాటాల్సిందే.. లక్షా ఓట్లు రావాల్సిందే…

గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే విజయం సాధించాలంటే లక్షకు పైగా ఓట్లు రాబట్టాల్సి ఉంటుంది. అంటే సుమారు పోలైన ఓట్లలో 40 శాతం ఓటింగ్ పొందాల్సి ఉంటుంది. గతంలో గెలిచిన అభ్యర్థులు 36 శాతం నుంచి 51 శాతం వరకు ఓటింగ్ సాధించారు. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికి ఓటింగ్ శాతం 40 శాతం వరకు సాధిస్తేనే విజయ అవకాశాలు ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో 272870 ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. అంటే 40 శాతం ఓటింగ్ సాధించాలంటే సుమారుగా 109,148 ఓట్లు రావాల్సి ఉంటుంది. 1.10 లక్షల ఓట్లు సాధించిన అభ్యర్థికే విజయ అవకాశాలు ఉంటాయి.

సెంటిమెంటు ఫలించేనా

ఉప్పల్ అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికలు జరగ, ఒక సెంటిమెంటు ప్రధానంగా వర్కౌట్ అవుతూ వస్తుంది. ఇందులో భాగంగా 20009లో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీ లు పోటీ పడగా అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అదేవిధంగా 2014లో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పోటీపడ్డాయి. అయితే ఇందులో 2014లో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన భేతి సుభాష్ రెడ్డి 2018 ఎన్నికల్లో గెలుపొందారు. అదే విధంగా 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఎవరు గెలుస్తారు ? సెంటిమెంట్ ఎలా ఉంటుంది ? అనేదానిపై చర్చ జరుగుతుంది. అయితే 2009లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ 2014లో గెలుపొందారు. 2014లో ఓడిపోయిన సుభాష్ రెడ్డి 2018లో గెలుపొందారు. అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయిన బండారి లక్ష్మారెడ్డి 2023 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా బండారి కి అదృష్టం వరిస్తుందా వేచి చూడాల్సిందే.

ఉప్పల్లో పోలింగ్ 51.54 శాతం
గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా

2018లో 51.65 శాతం
,2014లో 49.3 శాతం,
2009లో 42.38 శాతం

 

బదిలీ అవుతున్న ఓటు బ్యాంకు
ఉప్పల్ నియోజకవర్గం ప్రజలు సెంటిమెంటును ఫాలో అవుతున్నారు. దీనికి ప్రధానంగా గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు విశ్లేషణలే ప్రధాన కారణమని చెప్పవచ్చు . అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి అభ్యర్థి గెలుపుకు దోహదపడ్డారు. అయితే గత అనంతరం 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి అండగా నిలిచి ఎంపీ గెలుపొందడంలో కీలకంగా మారారు . తదనంతరం జరిగిన 2020 కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా వరకు బిజెపికి ఓటు బ్యాంకు ఎక్కువగా వచ్చింది. ప్రధానంగా పది డివిజన్లో రెండు డివిజన్లు గెలుపొందగా, మిగతా ఏడు డివిజన్లోను బిజెపి అభ్యర్థులకు భారీగా ఓట్ బ్యాంకు లభించింది. దీన్నిబట్టి ఉప్పల్ ప్రజలు బిజెపి, బిఆర్ఎస్ , కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. అంటే వేసిన పార్టీకి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయడం లేదు. అంటే ఈసారి తప్పకుండా మళ్లీ బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది.

ఓటర్ల మనోగతం విభిన్నం

ఉప్పల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఓటు ఎవరికి వేశారని దానిపై పలు కూడలిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వీటిని ప్రధానంగా పరిశీలిస్తే గతంలో బిజెపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించామని, ఒకసారి ఛాన్స్ ఇచ్చామని పేర్కొంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఇంకా భవిష్యత్ ఉంది ఇంకా మరోసారి ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుంది , కానీ బిఆర్ఎస్ అభ్యర్థి ఒకసారి ఓటమి చెంది నిర్వియామంగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే బాగుంటుందని చర్చించడం ఆసక్తికరంగా మారింది.

గెలుపు పై ఎవరి ధీమా వారిదే

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆదివారం ఫలితాలు వెలవడంతో ఉప్పల్ ప్రజల్లో చర్చ సాగుతుంది . అయితే ఎవరు గెలుస్తారు అనేదానిపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ప్రతి కూడళ్ళు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రతి గల్లీ రోడ్లపై ఇదే చర్చ కొనసాగుతుంది. అయితే విశ్లేషణలు పరిశీలిస్తే అభ్యర్థులు తామే గెలుస్తామని ధీమాతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కి ఓటు బదిలీ అవుతుందని , ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం, సెటిలర్లు, జనసేన మద్దతు , గతంలో బిజెపికి పడిన ఓటు బ్యాంకు, నగరంలో బిజెపికి ఎక్కువగా పట్టు పై బిజెపి గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటు , సైలెంట్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే పడిందని తామే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బిఆర్ఎస్ పార్టీ తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, తనపై ప్రజలకున్న విశ్వాసం , అధికంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలం, ఓటర్లు, సంక్షేమ పథకాలు , అభివృద్ధి తాను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. అయితే గెలుపు ఎవరిని వరిస్తుందో ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

 

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *