మన ఈనాడు:గత నెలరోజులుగా హోరాహారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారంతో పోలింగ్ ముగిసింది. ఇక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ మందకొడిగానే సాగింది. 2018లో ఉప్పల్లో 51.65పోలింగ్ శాతం నమోదు అయింది. తాజాగా నిన్నటి ఎన్నికల్లో 51.35శాతం పోలింగ్ నమోదు చేసుకుంది.
మల్లాపూర్‌లో ‘కారు’కు హ్యాండ్:
ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్ పోలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అత్యధిక మెజార్టీ కారుకు వస్తుందని నేతలు అంచనాలు వేశారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బుధవారం అర్థరాత్రి అధికారపార్టీ అభ్యర్థి డబ్బు పంపిణీలో పూర్తిగా విఫలం అయ్యారని టాక్ నడిచింది. దీంతో ఓటర్లు మనస్సు మార్చుకుని కాంగ్రెస్ వైపు చూసినట్టు తెలుస్తోంది.
బూతుల్లో మెజార్టీ దిశగా హస్తం:
మల్లాపూర్ డివిజన్లో సైలెంట్‌గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించే దిశగా ఓటర్లును ప్రభావితం చేసింది. ప్రధానంగా 142,143,144,145,146,147,148,149,151,152,157,169,170,172,178,179,180,181, 211,212,పోలింగ్ బూతుల్లో స్పష్టమైన ఆధిక్యత వచ్చేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులు వేశారు. పదిహేను రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లును కలుస్తూ ఆరు గ్యారంటీలపై హమీనిస్తూ..ప్రభుత్వ వ్యతిరేఖ ఓటను కాంగ్రెస్‌కు బదలాయించడంలో పూర్తిగా సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. రాష్ర్టంతోపాటు ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి గెలుపు పక్కా అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.