BRSకు మాదిగలు అండగా నిలబడతాం..BLR​ను గెలిపించుకుంటాం!

మన ఈనాడు:
బీఆర్​ఎస్​కు ఎంఆర్​పీఎస్​ అండగా నిలబడుతుందని, ఉప్పల్​ బీఆర్​ఎస్(BRS)​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలుపించుకుంటామని ఎంఆర్​పీఎస్​ (MRPS)రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్​ అన్నారు. హబ్సిగూడ సుప్రభాత్​ హోటల్​లో సోమవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సబ్బండవర్గాల ప్రజల పక్షాన నిలబడటానికి బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్​పీఎస్​ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో దళిత కుటుంభాల సంక్షేమం శ్రేయస్సు కోసం కృషి చేసి సక్సెస్​ అయిందన్నారు. అంతేగాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసే విషయంలో తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

గడిచిన 25ఏళ్లుగా మాదిగ కుటుంభాలతో బంధుత్వం బండారి కుటుంబంతో ఉందని గుర్తు చేశారు. కుల,మతాలకు అతీతంగా పేదల పక్షాన నిలబడే బీఎల్​ఆర్​(BLR) గెలుపించుకోడానికి అహర్నిశలు పనిచేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంఆర్​పీఎస్​ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, కోర్​ కమిటీ సభ్యులు నాగారం బాబు, మంచాల యాదగిరి, నెమిళ్ల భాగ్యమ్మ, బొల్లం జ్యోతి, గద్దల దుర్గయ్య, గొర్ల జగన్​, మైలారం నాగేందర్​, వేముల హరిబాబు పాల్గొన్నారు.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *