ఉప్పల్: ప్రభుత్వ పథకాలు..బీఎల్ఆర్ ట్రస్టు చేస్తున్న సేవలతో ఉప్పల్ ‘కారు’ గెలుపు పక్కా అని ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పల్,మల్లాపూర్ డివిజన్లలో జరిగిన బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమావేశంలో బండారికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా జీవితంలో ఉంటూనే బీఎల్ఆర్ ట్రస్టు పేరుతో రాజకీయాలకు అతీతంగా ఆయన చేసిన సేవలతో ప్రజల మనస్సులో నిలిచారు. ప్రధానంగా వైద్య విద్యార్ధుల చదువులకు అయ్యే కళాశాల ఫీజులు మొత్తం చెల్లించి సాయం చేస్తున్నారు.
100పడకల ఆసుపత్రి మంజూరులో తనదైన ముద్ర
ఉప్పల్ నియోజకవర్గానికి 100పడకల ఆసుపత్రికి ప్రభుత్వం రూ.37.50కోట్ల నిధులు మంజూరు చేయడంలో బీఎల్ఆర్ తనదైన ముద్ర వేశారు. అంతేకుండా మరో జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి సర్కారు కళాశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని హమీనిచ్చారు.
కార్యకర్తలకు అండగా నిలుస్తా:
ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తల కష్ట:సుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా నిలుస్తానని భరోసా కల్పిస్తున్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి న్యాయం జరిగేలా పార్టీ పెద్దలతో చర్చించి అందరికి అవకాశాలు ఉంటాయని నమ్మకం కల్గిస్తున్నారు. వీటిన్నింటిని ప్రజలు, కార్యకర్తల్లో బీఆర్ఎస్ పట్ల విశ్వాసం పెరగడంతో కారు గెలుపుకు సులువుగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది.