Education:విద్యాసంస్థల్లోకి వారసులు…-వయస్సు 30లోపే అయినా కిలక బాధ్యతలు

ఖమ్మం, మన ఈనాడు: విద్యాసంస్థల నిర్వహణ సామాన్య విషయం కాదు.. ఎంతో అనుభవం, అన్ని అంశాలు పట్ల అవగాహన, పరిస్థితులకి తగినట్లు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, వీటన్నిటితోనే విద్యాసంస్థ సక్సెస్ అవుతుంది. అలా ఖమ్మం జిల్లా లో దశబ్దా కాలంగా ఎదురులేకుండా విజయ పరంపర సాగిస్తున్న కొన్ని విద్యాసంస్థల్లోకి వారసులు వచ్చారు. తాము చదివిన ఉన్నత చదువుల అనుభవాన్ని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు.

న్యూ విజన్….
జిల్లాలో పాఠశాల విద్యలో న్యూ విజన్ ఒక సంచలనం. కాన్సెప్ట్ విద్య పేరుతో 2005లో వచ్చి ఎన్నో రికార్డ్స్ ను నమోదు చేసింది. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలో సీట్ రావాలంటే న్యూ విజన్ లో ఫౌండేషన్ లో చదివితే పక్కా అనే స్థాయి కి తీసుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది, తరవాత జూనియర్ కాలేజీ ని ఏర్పాటు చేసి విజయ పరంపర కొనసాగించారు. చైర్మన్ ప్రసాద్ కుమారుడు కార్తీక్ అమెరికా(USA) లో MSపూర్తి చేసి, అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం తో ఇన్ని సంవత్సరాలనుండి ఉండి రీసెంట్ గా ఖమ్మం(KHAMMAM) షిఫ్ట్ అయ్యారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్స్ ని కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతున్నాయి. స్కూల్స్, కాలేజ్ లలో న్యూ విజన్ అంటే ప్రత్యేకత.

*శ్రీ చైతన్య..
తెలంగాణ కార్పొరేట్ విద్యాసంస్థల లో శ్రీ చైతన్య ఒక్కసారి గా దూసుకొచ్చింది. గత 25సంవత్సరాలుగా జూనియర్ కళాశాల లని నిర్వహిస్తూ తనకి తానే పోటీగా అన్నింటా నెంబర్ 1ర్యాంక్ లతో రాణిస్తుంది. ఇదే ఉత్సాహం తో స్కూల్స్ స్థాపించి రాష్ట్రం లోని ప్రతి నియోజకవర్గం లో పెట్టి సక్సెస్ అయ్యారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యలో అడుగు పెట్టారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ని డీమ్డ్డ్ యూనివర్సిటీ గా మార్చానున్నారు. శ్రీధర్ -శ్రీ విద్య ల వారసురాలు సాయి్గీతిక ఆ బాధ్యత చూస్తున్నారు. మెడిసిన్ చదివి, ప్రస్తుతం PG చేస్తూ కాలేజీ ని అకాడమిక్ గా పరుగులు పెట్టిస్తున్నారు.

*SBIT..
లెక్చరర్ గా ప్రస్థానం ప్రారంభించి నేడు కేజీ to పీజీ వరకు విద్యాసంస్థల ని స్థాపించిన విద్యారంగం లో విప్లవం సృష్టించిన వ్యక్తి గుండాల కృష్ణ అలియాస్ rjc కృష్ణ. జూనియర్, డిగ్రీ, bed వంటి వాటితో పాటు ఖమ్మం లోనే సాంకేతిక విద్యలో సంచలనం నమోదు చేసిన sbit ని సైతం కొన్నారు. విద్యాసంస్థల నిర్వహణలో తనకి తిరుగులేదని నిరూపించారు. తన గారాల పట్టి ధాత్రి వైద్య విద్య ని పూర్తి చేసింది, ఇప్పుడు తానే కరెస్పాండంట్ గా భాద్యతలు చూస్తుంది. ప్రెసెంట్ టెక్నాలజీ తో విద్యార్థుల కి అత్యధిక ప్లేసెమెంట్స్ కల్పించడంలో తనదే కిలక పాత్ర.

* గీతాంజలి..
నగరంలోని త్రీ టౌన్ లో గీతాంజలి స్కూల్ ని ఏర్పాటు చేసారు. సాధారణ ఫీజు తో అద్భుతాలు చేసారు. బట్టి పద్ధతి కాకుండా నైపుణ్యం కూడిన విద్యను అందించేదుకు భార్యభర్తలైన అప్పారావు -పద్మ లు తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి సక్సెస్ అయ్యారు. ఇంతి ఇంతి ఐ వటుడింతయి అన్నట్లుగా స్కూల్ ని రెండు స్వంత భవనాల్లో నిర్వహణ సాగిస్తున్నారు. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు సాఫ్ట్వేర్ రంగంలో, మరో కుమారుడు అరుణ్ మంచి విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రి గా తగ్గ వారసుడిగా స్కూల్ నిర్వహణ చూస్తున్నాడు. మరో ఇంటర్నేషనల్ స్కూల్ ని పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు.

Share post:

లేటెస్ట్