బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. వరంగల్(Warngal) ఎంపీ బరిలోనుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురే కావ్య.
తండ్రి కూతుళ్లు కాంగ్రెస్‌లో నేడు చేరబోతున్నట్లుగా సమాచారం.ఇప్పటికే డిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరికి(kadiyam Srihari) సీఎం రేవంత్ టీమ్‌లో మంత్రి పదవి ఇవ్వబోతున్నరని సమాచారం.
వరంగల్ జిల్లాలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందని, పరస్పర సహకారం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, భూకబ్జాలు, లిక్కర్ స్కాం వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని కడియం కావ్య తెలిపారు.
ఇలాంటి పరిస్థితులను చూసాక తాను పోటీ నుంచి విరమించుకోడానికి నిర్ణయం తీసుకున్నట్లు కడియం కావ్య తప్పుకున్నారు.
ఇప్పటికే వరంగల్ ఎంపీ సీటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిగా కావ్యను ప్రకటించబోతున్నారు.