T BJP| తెలంగాణ బీజేపీ ఖాతాలో 12స్థానాలు: ఈటెల కామెంట్స్​

Mana Enadu: ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఉన్నారని మల్కాజ్​గిరి బీజేపీ పార్లమెంట్​ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు.

తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని, ఊహించని విధంగా ఈ జూన్ 4వ తేదీన గొప్ప అద్భుతం జరగబోతోందన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్​ నిర్వహించారు.బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించబోతోందని పేర్కొన్నారు.

ప్రజల తీర్పు నిక్షిప్తంగా ఉంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో అవే మాటలు మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడని విమర్శలు చేశారు.

నేడు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడా బాంబుల పేలుళ్లు లేవు. అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.

మేము ప్రచారం నిమిత్తం ఏ ఇంటికి పోయినా సాదరంగా ఆహ్వానించి బీజేపీకే ఓటు వేస్తామంటున్నారు.

తెలంగాణలో ఖచ్చింతంగా అమిత్‌షా చెప్పినట్లు 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదే అన్నారు.

రాష్ట్రమేలు కోసం బీజేపీ ఎంపీగా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇస్తుందన్నారు.

Share post:

లేటెస్ట్