Mana Enadu:చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మనల్ని అందంగా ఇతరులకు చూపించడంలో శిరోజాలది కూడా కీలకపాత్రే. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ముఖ్యం. అది లోపిస్తే జుట్టు దెబ్బతిని డ్రైగా మారుతుంది. తర్వాత రాలిపోతుంది.
☛ రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకు హెయిర్ సీరంను వాడితే చిక్కులు పడదు.
☛ స్కాల్ప్ మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు స్కాల్ప్ మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా ఉంటుంది.
☛ రాత్రి పడుకునే ముందు జుట్టును టైట్‌గా అల్లుకోవడం మంచిదికాదు. ఇది కుదుళ్లు లూజ్‌గా అయ్యేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు ఊడిపోతుంది. అందుకే రాత్రివేళ జుట్టును వదులుగా ఉండేలా చూసుకోవాలి.
☛ సిల్క్ దిండుపై పడుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
☛ తడి జుట్టుతో ఎప్పుడూ నిద్రపోవద్దు. దీని వల్ల జుట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది.
☛ నువ్వుల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. అందుకే నువ్వులతో చేసిన పదార్థాలను తినాలి.
☛ జుట్టు హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినాలి. వీటిలో ఉండే విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
☛ మజ్జిగ లేదా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది జుట్టుకు మేలు చేస్తుంది.
* ప్రొటీన్ లోపాన్ని ఇలా గుర్తించండి
మన శరీరానికి అవసరం మేరకు ప్రొటీన్స్ లభించకపోతే శారీరక విధులను సక్రమంగా నిర్వర్తించడం కష్టమవుతుంది. శరీరంలో హార్మోన్లు, కండరాలు, చర్మం, ఎంజైములను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రొటీన్ లోపిస్తే మన శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
☛ మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్ లోపిస్తే గోళ్లు పెళుసుగా మారుతాయి. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారినట్టు అవుతుంది.
☛ కాళ్లు, పాదాలు, చేతుల్లో వాపు కనపడుతుంది.
☛ తగినంత ప్రొటీన్ ఫుడ్ తీసుకోకపోతే కండరాల బలహీనత ఏర్పడి చిన్న బరువులను కూడా మోయలేరు.
☛ ఆకలిని నియంత్రించడంలో ప్రొటీన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే ఆకలి విపరీతంగా ఉంటుంది. అందుకే తగినంత ప్రొటీన్ ఉన్న ఆహార పదార్థాలను తినాలి.








