Health:ఉప్పుతో ముప్పు.. ఎక్కువగా వాడితే ఈ వ్యాధులు రావడం ఖాయం! 

ManaEnadu:మానవశరీరంలో గుండె ఎంత ముఖ్యమో.. వంటల్లో ఉప్పు అంతే ముఖ్యం. గుండె కాస్త తక్కువ కొట్టుకున్నా.. ఎక్కువ వేగంతో కొట్టుకున్నా అనారోగ్యానికి గురైనట్లు.. వంటల్లో ఉప్పు కాస్త తక్కువైనా.. ఎక్కువైనా వంటకం టేస్టే మారిపోతుంది. ఎంత గొప్ప వంటకమైనా సరిపడా ఉప్పు (Salt) లేకపోతే నోటికి రుచించదు. కండరాలు సంకోచించడంలో, నరాలు ఉత్తేజితమవ్వడంలో ఉప్పు ఎంతో దోహదపడుతుంది. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న ఉప్పు(Excess Salt)ను ఎక్కువ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి (Health Issues) ముప్పు అంటున్నారు ప్రముఖ డాక్టర్ వుక్కల రాజేశ్. మరి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్యాలేంటో ఓసారి చూద్దామా..?

హై బీపీ (Hyper Tension) : కాస్త కోపగించుకుంటే.. ఉప్పు ఎక్కువ తింటున్నావా అంటారు కదా. నిజంగానే శరీరంలో ఉప్పు శాతం పెరిగితే బీపీ ఎక్కువుతుందట. ఉప్పు ఎక్కువ తీసుకుంటే అధిక రక్తపోటు పెరిగి హైపర్ టెన్షన్ కు దారితీస్తుందట. 

తరచూ మూత్రం : ఇక ఉప్పు ఎక్కువ తింటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందట.

దాహంగా అనిపించడం: ఉప్పు ఎక్కువ తింటే తరచూ దాహం వేస్తుందట. 

శరీరంలో వాపు:  అధిక ఉప్పు వల్ల శరీరంలో నీరు పేరుకుపోయి చేతులు, పాదాలు, ముఖం, కాళ్లలో వాపు వస్తుందట.

అలసట, బలహీనత: ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తరచూ అలసటకు గురవుతారట. శరీరం బలహీనపడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

అందుకే శరీరానికి ఇన్ని అనారోగ్యాలు తీసుకువచ్చే ఉప్పు (Salt Content)ను సరైన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల్లో ఉప్పు శాతం తగ్గించాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు (Vegetables) ఎక్కువ తినాలని.. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో అదనపు ఉప్పు తొలగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. 

గమనిక : ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Heart Attack: గుండెపోటుకి ముందు కనిపించే సంకేతాలివే! వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత టెక్ యుగంలో గుండెపోటు(Heart Attack) అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), వ్యాయామం(Exercise) చేయకపోవడం, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు(Heart Problems) వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *