Zomato:జొమాటో కస్టమర్లకు షాక్.. ఇక నుంచి ఆ సర్వీసులు క్యాన్సిల్

ManaEnadu:నేటి తరంలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వేరే ఊళ్లో ఉంటున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలేసి చాలా మంది నగరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఈ బ్యాచిలర్ లైఫ్ లో వంట చేసుకునే తీరిక ఎక్కడుటుంది. అందుకే చాలా మంది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీ, జొమాట్, ఊబర్ ఈట్స్, ఈట్ ఫిట్ వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కు డిమాండ్ పెరిగిపోయింది.

ముఖ్యంగా వీటన్నింటిలో స్విగ్గీ, జొమాటోకు డిమాండ్ ఎక్కువ. అయితే యూత్ ఎక్కువగా జొమాటో యాప్ ను వినియోగిస్తున్నారు. ఇందులో డిస్కౌంట్స్, ఆఫర్స్ తో జొమాటో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఈ సంస్థ తన కస్టమర్లకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇంటర్ సిటీ ఫుడ్ డెలివరీ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. 

ఇంటర్ సిటీ సేవలు అంటే ఏంటి..?

ఇంతకీ ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్ అంటే ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న 10 సిటీల్లోని ఫేమస్ వంటకాలను ఆ నగరంలోనే కాకుండా వివిధ ప్రాంతాలకూ డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ సేవలను జొమాటో ప్రారంభించింది. ఓ నగరంలో ఉన్న కస్టమర్ మరో సిటీలోని ఫేమస్ రెస్టారెంట్ లోని ఫుడ్ తినాలనుకుంటే.. ఆ ఫుడ్ ఐటెమ్స్ ను కస్టమర్ కోరుకున్న 24 గంటల్లో ఒక సిటీ నుంచి మరొక సిటీకి ఫ్లైట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తారన్నమాట.

కస్టమర్ కోరుకున్న ఫుడ్ ను కోరుకున్న రెస్టారెంట్ లో తయారు చేయించి రీయూజబుల్ టాంపర్ ప్రూఫ్ కంటైనర్​లో ప్యాక్ చేసి..  మొబైల్ రిఫ్రిజిరేషన్ పద్ధతిలో ఫ్రెష్ గా కస్టమర్లకు అందిస్తారు. అయితే ఈ ఫుడ్ పాడవకుండా ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఫ్రీజింగ్ పద్ధతులు వాడరు. ఇక ఈ పార్శిల్ అందుకున్న కస్టమర్ ఆ ఫుడ్ ను మైక్రోవేవ్​, ఎయిర్ ఫ్రై, పాన్ ఫ్రై గానీ చేసుకుని వేడి వేడిగా లాగించొచ్చు అన్నమాట.

ఇంటర్ సిటీ సర్వీసు ఎందుకు నిలిపేశారంటే?

ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవాలంటే కనీసం రూ.5వేలు విలువ చేసే ఫుడ్ ఆర్డర్ చేయాలి. అయితే మొదట్లో ఈ సర్వీసు వల్ల లాభాలు వస్తాయని ఆశించినా అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే కొన్నాళ్లు ఈ సర్వీసు నిలిపివేసింది. మళ్లీ ఇటీవల జులైలో తిరిగి ప్రారంభించినా పెద్దగా ఆర్డర్లు, లాభాలు రాకపోవడంతో మొత్తానికే ఈ సర్వీసు నిలిపివేస్తున్నట్లు జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.

Share post:

లేటెస్ట్