మన ఈనాడు:
ఉప్పల్ నియోజవర్గం బూత్ కమిటీ సమావేశానికి మంత్రి KTR హాజరు కానున్నారు. నవంబర్ 2న మల్లాపూర్ VNR గార్డెన్స్ లో జరిగే సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం 406 బూతులకి గాను ఒక్కో బూతు నుంచి 10 మంది బూతు కమిటీ సభ్యులకి ప్రత్యేక పాస్ లు సైతం ఇవ్వబోతున్నారు. మొత్తం 6వేల మందికి పాస్ లు ఇస్తున్నట్లు సమాచారం. పాస్ లు ఉన్నవారినే సమావేశానికి అనుమతించబోతున్నట్లు తెలిసింది.