Eatala Rajender| మేడ్చల్‌లో ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు

Mana Enadu|ఈ అనంతవిశ్వంలోని కోటానుకోట్ల జీవులకు మూలాధారమైన నీటిని దివి నుండి భువికి తెచ్చిన భగీరథుడి గురించి మనందరికీ తెలుసని మల్కాజ్​గిరి పార్లమెంట్​ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు.

ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయన తలపై గంగమ్మను భూమిపైకి తెచ్చి మానవాళికి నీటిని అందించమని ప్రార్థించారు.

అలాంటి కఠోర తపస్సు ద్వారా గంగను భూమిపై తెచ్చిన ఆ మహానుభావుని పేరుతో నిర్వహిస్తున్న జయంతి ఉత్సవాల్లో మంగళవారం ఈటెల హజరయ్యారు. అప్పట్లో మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయించామని పేర్కొన్నారు.

రాష్ట్రాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ గొడవలు జరిగేది నదీ జలాల కోసమే అని మనకు తెలుసన్నారు.

ఆ భగీరథుని పేరుతో మిషన్ భగీరథ అనే పథకం ద్వారా పల్లెపల్లెకూ నీరందించడం జరిగిందని వివరించారు.

మనిషికి కూడు, గుడ్డ, నీరు తెచ్చిన ఆద్యులు సగరులు. వారి పేరుతో వచ్చింది సగర జాతి భగీరథ మహర్షి సంఘం అన్నారు.

పురాణ కాలంలో సగరుల వల్ల సాగరం ఏర్పడిన సంగతి మనకు తెలుసు ఇప్పుడు సగర జాతి వారు ఎందరో చెరువులకు, కుంటలకి, ప్రాజెక్టులకు రూపశిల్పులు ఈ సగరులే.

ఈ సంఘం వారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతగానో సహకరించారు. మీకు కావలసిన పనులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాటిస్తున్నానని ప్రకటించారు.

Share post:

లేటెస్ట్