గుడ్​ న్యూస్​ – రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు

Mana Enadu: తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. మహిళా శక్తి క్యాంటీన్​ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు​ తెలిపారు.

గ్రామైక్య సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తామన్నారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మహిళా శక్తి క్యాంటీన్​ సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్​ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.

 

Share post:

లేటెస్ట్