Breaking : వైజాగ్​లో MRO దారుణ హత్య

మన ఈనాడు: విశాఖపట్నం జిల్లాలో దారుణం ఘటన జరిగింది. కొమ్మాది మండల MRO రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు.

గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే రమణయ్యను ఎవరు హత్య చేశారో, కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. అయితే ఇదంతా ల్యాండ్ మాఫియా వాళ్ళ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కక్షగట్టే ఈ పని చేశారని అంటున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీపీ రవిశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఎమ్మార్వో రమణయ్య పదేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు. డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, కలెక్టరేట్లో ఏవో గా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పని చేసిన రమణయ్యకు ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది.

Related Posts

Nirmal Kapoor: బాలీవుడ్‌లో విషాదం.. నిర్మల్ కపూర్ కన్నుమూత!

బాలీవుడ్‌(Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి, నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. ఇవాళ సాయంత్రం (మే 2) 5:45 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్(Dhirubhai Ambani Hospital)లో ఆమె…

Aghori: లేడీ అఘోరీకి 14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు

గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్‌(UP)లో అరెస్టు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *