గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవన విధానంతోపాటు వారి నేపథ్యం గురించి నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పేలా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ , ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ అక్షర గ్రామోత్సవ్ పేరుతో శనివారం కార్యక్రమం నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల వేషధారణలో అలరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులు, వారి రోజువారీ కార్యక్రమాలను తలపించేలా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులు బృందాలుగా విడిపోయి వారు గ్రామీణ నేపధ్యాన్ని ప్రదర్శిస్తూ చేసిన కళాకండాలు, నృత్యాలు, అలాగే గ్రామాల్లో ఉండే నివాస గృహాలు, అలనాటి చరిత్రను తలపించేలా చేసిన కార్యక్రమాలు తల్లిదండ్రులను మైమరపింపచేశాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రితిక మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవన విధానం, వారి నేపథ్యం మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నదని, మారుతున్న ప్రజల జీవన విధానం మూలాన నాటి గ్రామీణ చరిత్రను నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఉన్నదని వారు తెలిపారు. అంతర్జాతీయ పద్దతిలో భోధన చేస్తూనే నేటి గ్రామీణ చరిత్రను, ప్రజల ఇతివృత్తాన్ని పాఠశాల విద్యార్థులకు బోధిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రితిక, వైస్ ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.